
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఈనెల 24న రిలీజ్ అవుతుంది. వీరమల్లు ఓటిటీ హక్కులు అమోజాన్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఓటీటీ ద్వారా దాదాపు రు. 80 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇది చాలా మంచి డీల్. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. ఈ రెండిటి ద్వారా అటు ఇటుగా 110 కోట్లు రాబట్టింది. అయితే ఈ రెండు రైట్స్ ద్వారా 110 కోట్లు వచ్చిన నిర్మాత ఏం రత్నం చాలా చోట్ల నుంచి ఫైనాన్స్ తెచ్చి ఈ సినిమాను పూర్తి చేశారు. నాన్ థియేట్రికల్ రూపంలో వచ్చిన ఆదాయం ఫైనాన్షియర్లకు పంచడానికి సరిపోయింది. కాబట్టి ఇంకా ఆయనకు రిలీఫ్ దొరకలేదని చెప్పాలి.
మరోవైపు రెండు రోజుల్లో ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్ తో అభిమానులకే కాదు బిజినెస్ వర్గాల్లోనూ ఊపు వస్తుందని ఇన్సైడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. అయితే ట్రైలర్ చూసిన కొంతమంది పవన్ ఫ్యాన్స్ కు మాత్రం ఇది అదిరిపోయే ఫీస్ట్ అంటూ కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. పవన్ నోటి నుంచి వచ్చిన డైలాగులు జనాలను థియేటర్లకు రప్పించాలా ఉన్నాయి అంటున్నారు. మేకింగ్ పరంగాను క్వాలిటీ అదిరిపోయిందని .. నిర్మాత నాగవంశీ కూడా ఈ ట్రైలర్ పై ట్వీట్ చేసి అభిమానులు అంచనాలు పెంచేశారు. సినిమా రిలీజ్ 20 రోజులు ముందుగానే ట్రైలర్ చూపిస్తున్నారంటే ఈ ట్రైలర్ సినిమా బిజినెస్ కి ఎంత ముఖ్యమో తెలుస్తోంది. వీరమల్లు నుంచి రావాల్సిన పాటలు, ప్రమోషన్లు కూడా ఉన్నాయి. ఇక పవన్ ప్రస్తుతం ఉస్తాద్ షూటింగ్ కి సమయం కేటాయించారు. ఈ గ్యాప్‌లో ఆయన వీరమల్లు సినిమా ప్రమోషన్లలో పాల్గొనే అవకాశం ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు