
ఏం చేస్తున్నాం..? ఎలా చేస్తున్నాం..? ఎందుకు చేస్తున్నాం..? అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు క్లియర్ గా చెప్పేస్తూ ఉంటాడు. కాగా ఎప్పుడో సందీప్ రెడ్డివంగా "ప్రభాస్ " తో "స్పిరిట్" అనే సినిమా చేస్తున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్ అంటూ ఆయనే స్వయంగా ప్రకటించాడు . దానికి సంబంధించిన ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు . పలు ఇంటర్వ్యూలలో పలు సందర్భాలలో ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ప్రభాస్ ని మీరు ఈ సినిమాలో చూడబోతున్నారు అంటూ హైలెట్ చేశారు .
అయితే ఈ సినిమాకి న్యూ టీటిల్ పెట్టాలి అని మూవీ టీం ఆలోచిస్తుందట . "స్పిరిట్" అనే టైటిల్ ఈ కాన్సెప్ట్ కి పెద్దగా సూట్ కాకపోవచ్చు అంటూ ..ఈ నిర్ణయం తీసుకున్నారట. నిజానికి సందీప్ రెడ్డివంగా - ప్రభాస్ కోసం రాసుకున్న ఫస్ట్ స్టోరీకి స్పిరిట్ అనే టైటిల్ సూట్ అవుతుందట. కానీ దీపిక పదుకొనె స్టోరీ లీక్ చేయడంతో ఆ స్టోరీని మొత్తం చేంజ్ చేసేసారట సందీప్ రెడ్డి . ఆ కారణంగానే సినిమాకి "పవర్ ఫుల్ పోలీస్" అనే టైటిల్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారట . కొంతమంది స్పిరిట్ ట్యాగ్ లైన్ పవర్ఫుల్ పోలీస్ అని పెడితే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తున్నారు . చూడాలి మరి సందీప్ రెడ్డివంగా ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది. ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి . ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అంటూ రెబెల్ ఫ్యాన్స్ వెయిటింగ్..!!