
వర్కింగ్ డే నాడు కూడ ఈమూవీకి బుక్ మై షో యాప్ లో దేశవ్యాప్తంగా 40 వేల టిక్కెట్లు అమ్మడం జరిగింది అని వస్తున్న వార్తలు విని అమీర్ ఖాన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈసినిమాకు మొదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆతరువాత కలక్షన్స్ పరంగా నిలదొక్కుకోవాడం వెనుక అమీర్ ఖాన్ నుసరించినా ఒక వ్యూహం ఉంది అంటూ బాలీవుడ్ మీడియా వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి.
నెట్ ఫ్లికస్ లాంటి బడా ఓటీటీ సంస్థలు ఈసినిమాకు 100 కోట్ల భారీ పారితోషికం ఇస్తాము అని అమీర్ ఖాన్తో రాయబారాలు చేసినప్పటికీ అమీర్ ఆ ఆఫర్ కు ఒప్పుకోకుండా ఏసీనిమా విడుదలైన మూడు నెలలు తరువాత యూట్యూబ్ లో పేపర్ పర్ వ్యూ మోడల్ లో విడుదల చేస్తాను అని పలుమార్లు చెప్పడంతో అమీర్ ఖాన్ లాంటి టాప్ హీరో సినిమాను చూడకుండా 90 రోజులు ఉండలేక ప్రేక్షకులు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ టాక్ ను పట్టించు కోకుండా అమీర్ ఖాన్ మూవీని ధియేటర్లలో చూడటానికి వస్తు ఉండటంతో ఈమూవీకి ఈ రేంజ్ లో భారీ కలక్షన్స్ వస్తున్నాయి అన్న కామెంట్స్ బాలీవుడ్ మీడియా చేస్తోంది..
అంతేకాదు ఈసినిమాకు సంబంధించి ఈమూవీ డివైడ్ టాక్ తో సంబంధం లేకుండా ఈమూవీని అమీర్ ఖాన్ ప్రమోట్ చేసిన తీరు అందరికీ బాగా నచ్చడంతో దేశవ్యాప్తంగా అమీర్ ఖాన్ అభిమానులు శింపతితో తన హిట్ వచ్చి తీరాలి అన్న భావనతో ప్రేక్షకులు ధియేటర్లకు రావడంతో ఈమూవీకి ఈ రేంజ్ లో కలక్షన్స్ వస్తున్నాయి అని అంటున్నారు..