సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు .. ఇప్పుడు ఆ సినిమా తర్వాత వెంకటేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . వీరిద్దరి కాంబోలో అతి త్వరలోనే ఓ సినిమా మొదలు కాబోతుంది .. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులన్నీ ఎంతో చ‌క చ‌క జరుగుతున్నాయి .. అలాగే ఈ సినిమాకి వెంకటరమణ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి .. ప్రధానంగా వెంకటేష్ ఇమేజ్ కు ఇది బాగా సెట్ అయ్యే టైటిల్ .. అలాగే ఈ టైటిల్ వినగానే ఇది మంచి ఫ్యామిలీ సినిమా అనే ఫీలింగ్ కూడా వస్తుంది .. త్రివిక్రమ్‌ కూడా ఈ సినిమా స్టోరీని అలానే తీర్చిదిద్దబోతున్నాడని కూడా తెలుస్తుంది ..


నువ్వు నాకు నచ్చావ్ లాంటి టైపు కథని,  హిలేరియ‌స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి . అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు .. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రిష పేరు మాత్రం ఈ సినిమాలో హీరోయిన్గా గట్టిగా వినిపిస్తుంది .. ఇప్పటికే వెంకటేష్ , త్రిష లది హిట్ కాంబో .. ఈ కాంబోనే మరోసారి రిపీట్ చేయడానికి త్రివిక్రమ్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు .. అయితే హీరోయిన్ డేట్లు ఎక్కువగా కావాలి .. త్రిష కావ‌ల్సిన‌న్ని డేట్లు ఇస్తుందా లేదా ? అనేది మాత్రం కొంత అనుమానం .. మ‌రోవైపు రుక్మిణి వ‌సంత‌న్  పేరు కూడా సెకండ్ ఆప్షన్ గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది .. ప్రస్తుతం రుక్మిణి కూడా ఎంతో బిజీగా ఉంది ..


అలాగే వెంకటేష్ తో తన జోడి కూడా ఎంతో ఫ్రెష్ గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది .  ఇక మరి ఈ ఇద్దరిలో ఒకరు ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది .. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ పేరు వినిపిస్తున్న .. మిక్కీ జే.మేయ‌ర్  కి ఇంకో అవకాశం ఉందని అంటున్నారు .. అలాగే ఇలాంటి కథకు మిక్కీ సరిపోతాడు .. అలాగే అఆ తర్వాత మిక్కీతో త్రివిక్రమ్ మరో సినిమా చేయలేదు .. అందుకే ఇప్పుడు ఈసారి త్రివిక్రమ్ , మిక్కి వైపు ఆసక్తి చూపొచ్చు అని అంటున్నారు .. ఇలా మొత్తానికి వెంకటేష్ సినిమాకు సంబంధించిన పనులన్నీ ఎంతో వేగంగా జరుగుతున్నాయి .. అలాగే త్వరలోనే ఓ అఫీషియల్ ప్ర‌క‌ట‌న కూడా రావచ్చని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: