ఏంటి ఫిష్ వెంకట్ కి రెండో భార్య ఉందా.. ఈ కొత్త పంచాయితీ ఏంటి అనుకుంటారు ఈ విషయం గురించి తెలిసిన చాలా మంది నెటిజన్లు.. ఎన్నో సినిమాల్లో నటించి విలన్ గా..కామెడీ విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన ఫిష్ వెంకట్ ఈ మధ్యకాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉన్న ఫిష్ వెంకట్ కి సంబంధించి ఎన్నో వార్తలు  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫిష్ వెంకట్ కి రెండు కిడ్నీలు పాడవ్వడంతో చికిత్స చేయించడానికి డబ్బులు లేక కుటుంబ సభ్యులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ చేయించాలంటే దాదాపు 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఎవరైనా డబ్బు సహాయం చేస్తారేమోనని దాతల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సాయం చేశారంటూ వార్తలు వినిపించినప్పటికీ అదంతా ఫేక్ కాల్ అని తర్వాత బయటకు వచ్చింది.అలాగే తెలంగాణ కాంగ్రెస్ మంత్రి అయినటువంటి వాకిటి శ్రీహరి ఆయన్ని కలిసి ఈయన హాస్పిటల్ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇక ఫిష్ వెంకట్ తో కలిసి నటించిన కొంతమంది ఆయనకు విరాళాలు ఇచ్చారు. అలాగే యంగ్ హీరో విశ్వక్సేన్ తన వంతుగా రెండు లక్షల సహాయం చేశారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఫిష్ వెంకట్ గురించి ఒక కొత్త పంచాయతీ తెరమీదకి వచ్చింది. అదేంటంటే ఫిష్ వెంకట్ తన సినీ కెరియర్ లో ఎన్నో డబ్బులు సంపాదించారని, కానీ రెండు పెళ్లిళ్లు కావడంతో రెండు ఫ్యామిలీలకు డబ్బులు అడ్జస్ట్ చేయడం వల్ల చివరికి తనకంటూ ఏమి మిగిల్చుకోకుండా డబ్బులు ఖర్చు చేశారంటూ ఒక వార్త మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

ఇద్దరు భార్యల కారణంగానే వారికి అన్ని సౌకర్యాలు సమకూర్చి చివరికి తనకే డబ్బులు లేకుండా చేసుకున్నారని,అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు అంటూ ఒక వార్త తెరమీదకి వచ్చింది. దీంతో ఫిష్ వెంకట్ కి రెండో భార్య ఉంది అనే వార్తపై తాజాగా స్పందించింది ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి.. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా నాన్న ఆరోగ్యం బాలేక చాలా రోజుల నుండి హాస్పిటల్లో ఉంటున్నారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆయనపై ఇలాంటి రూమర్లు రావడం నిజంగా బాధాకరం. ఆయనకి రెండో పెళ్లి అయిందని, రెండో భార్య ఉందని,రెండు ఫ్యామిలీలకు డబ్బు సర్దడం వల్లే ఆయన డబ్బులు ఏమి సంపాదించుకోలేదని, ఆర్థికంగా నష్టపోయారంటూ మాట్లాడుతున్నారు.

మా నాన్నకు రెండో భార్య ఉంది అని రూమర్లు క్రియేట్ చేసే వారికి ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. మా నాన్నకు రెండో భార్య ఉంటే ఆయన హాస్పిటల్లో ఉంటే ఎందుకు ఆమె రావడం లేదు. కనీసం వచ్చి ఆమె చూడాలి కదా.. మీరు చెప్పిందే నిజమైతే రెండో భార్య ఎందుకు కనిపించడం లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి రుమర్లు క్రియేట్ చేసి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకండి.ఇలాంటి రూమర్లు క్రియేట్ చేయడం ఇప్పటికైనా మానుకోండి అంటూ ఫిష్ వెంకట్ కూతురు తన తండ్రి కి రెండో భార్య ఉంది అనే రూమర్లు క్రియేట్ చేసిన వారికి ఇచ్చి పడేసింది.ఇక ఫిష్ వెంకట్ కూతురు క్లారిటీతో ఫిష్ వెంకట్ కి రెండు పెళ్లిళ్లు కాలేదని, ఆయనకు ఉంది ఒకే భార్య అని అందరికీ తెలిసి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: