తెలుగు సినిమా మరో మాస్ పేజీ మూసుకుంది. తీరికలేని నటన, తూటా మాటలు, డైలాగ్ డెలివరీ … ఇవన్నీ కలబోసిన గోప్ప‌ ఆర్టిస్టు కోట శ్రీనివాసరావు ఇక లేరు. ఈరోజు తెల్లవారుజామున ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. వయసు – 83. కానీ ఎనర్జీ మాత్రం యువ హీరోలకూ తిసిపోని రేంజ్! ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హల్‌చల్: "హరిహర వీరమల్లు"లో కోట గారు చివరిసారి నటించారట … విడుదలకు ముందే ఆయన కన్నుమూయడం అంటే ఫాన్స్ కు గుండెను బరువెక్కించే విషాదం."ఈ సినిమా మరో పది రోజుల్లో థియేటర్లలో కి రానుండ గా… కోట గారి పాత్ర ప్రేక్షకులకు లాస్ట్ మాస్ మూమెంట్ అవుతుంది . కోట గారి కెరీర్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రాధాన్యత వహిస్తాయి.
 

మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఆయన నటన రెడీగా ఉండేది .. పవన్ పోలీస్ , కోట హీరోయిన్ శృతి హాసన్ తండ్రి గా.  క్లాసిక్ సీన్: పోలీస్ స్టేషన్‌లో పావురాలా కుర్చీలో కూర్చుని, "మందుబాబులం మేము…" పాటలో చప్పట్లతో తడిమిన మామ! "మందుబాబులం మేము.. మందుకొడితే మేమే మహారాజులం...  ఈ పాటలో కోట గారి ఎక్స్‌ప్రెషన్… థియేటర్లో పండగను తలపించేది. ఇప్పటికీ సోషల్ మీడియాలో వదలని వైరల్ డైలాగ్ !  తమ్ముడు (1999) .. పవన్ స్పోర్ట్స్ ఫైట్.. కోట విలన్ గ్యాంగ్ వెనుక మాస్టర్ మైండ్. కోట గారి కళ్లు చూస్తేనే ఒత్తిడి, కిల్లర్ లుక్ – ఎమోషనల్ విలన్ రేంజ్ చూపించారు. జానీ, బంగారం, .. సహనటుడిగా పవన్ పక్కన… మాస్ సన్నివేశాల్లో క్లాసికల్ కంట్రోల్‌తో కనిపించారు. మామా.. మందుబాబులం మేము అనే పాటలో ఊపు ఇచ్చిన కోట గారు ఇక లేరు అనడం జీర్ణించుకోలేం!" "హరిహర వీరమల్లు రిలీజ్ రోజునే థియేటర్లో కోట సీన్‌కి నిలువరౌండ్ లౌడ్ అవుతుంది!  "గబ్బర్ సింగ్ మామా .. తొలి సినిమా చిరంజీవితో…చివరి సినిమా పవన్ కళ్యాణ్‌తో… ఇంతకు మించి ఒక నటుడి మ‌స్ రేంజ్ అంటే  ఇదే!



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: