
ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. " పుట్టినరోజు నాడు కూడా ఎంతో ఉత్సాహంగా సంతోషంగా కనిపించారు అని .. అందరితో చక్కగా కలివిడిగా మాట్లాడారు అని.. సరదాగా జోకులు వేస్తూ ప్రశాంతంగా పుట్టినరోజుని జరుపుకున్నారు అని ..ఇంకా కొన్ని రోజులు మీతోనే ఉంటానని ఆశించారు అని ..ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు అని అనుకోలేకపోయాఉ అని కుటుంబ సభ్యులు బాధపడిపోతున్నారు . గత కొంతకాలంగా ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు ..మందులు వేసుకుంటున్నారు .. ఆరోగ్యమంత కుదుటగానే ఉంది అనుకునే లోపే ఇలా జరిగిపోయింది .
ఆయన చివరి శ్వాస వరకు పోరాడారు . ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది "అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటూ వాపోయారు. బాబు మోహన్ అయితే ఆయనని గుర్తు చేసుకుంటూ చిన్నపిల్లాడిలా గుక్కపట్టి ఏడ్చేసారు. హాస్యనటుడు బ్రహ్మానందం కూడా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు . కోట శ్రీనివాసరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీ ఎమోషనల్ గా స్పందిస్తున్నారు. కోట శ్రీనివాసరావు తెలుగులోనే కాదు మలయాళం - కన్నడ - హిందీ - తమిళం .. ఇలా అన్ని భాషల్లో కూడా నటించారు . అన్ని భాషల్లో కూడా సక్సెస్ అయ్యారు. కాగా కోటా శ్రీనివాసరావు జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు ఆయన లేని లోటు ఇండస్ట్రీలో ఎవ్వరు తీర్చలేనిది..!