
ఆయన సినీ కెరియర్ లో ఎన్నెన్నో పాత్రలో నటించాడు . కానీ అందరికీ షాకింగ్ అనిపించింది మాత్రం "మండలాధీశుడు" సినిమాలో ఆయన క్యారెక్టర్. 1987లో విడుదలైన ఈ మూవీలో కోటా శ్రీనివాసరావు.. రామారావు గారి పోలిన భీమారావు క్యారెక్టర్ లో నటించి మెప్పించారు. కృష్ణ నిర్మించిన ఈ సినిమా కారణంగా ఎన్నెన్నో ఇబ్బందులు ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది . ఈ విషయాన్ని కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు . అప్పట్లో ఆయనకు రోజుకి నాలుగు సినిమాల షూటింగ్ లు ఉండేటివి .
అయినా సరే ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసి ఎనిమిది రోజులు వరుసగా షూటింగ్ చేశారు. రిలీజ్ అయ్యాక ఈ సినిమా కారణంగా ఆయన కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేశారు . అంతేకాదు ఈ సినిమా కోసం ఆయన ఏకంగా ఐదు రోజులపాటు ఉపవాసం ఉన్నారు అంటూ కూడా ఓ ఇంటర్వ్యూలో బయటపడింది . "మండలాధీశుడు" చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను అనుకరించినట్లుగా ఉన్న పాత్ర కోసం కోటా శ్రీనివాసరావు చాలా చాలా టఫ్ సిచువేషన్ ఫేస్ చేశారు . ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఆయనకు చాలా సమయం పట్టింది . అంతే కాదు ఈ పాత్ర కోసం ఆయన ఏకంగా ఐదు రోజులు పాటు ఉపవాసం ఉన్నాను అంటూ ఒక సందర్భంలో బయట పెట్టారు . ఆ పాత్ర పట్ల చూపిన నిబద్ధత ఇది నిదర్శనం . అంతేకాదు "ఆహనా పెళ్ళంట" సినిమాలోని లక్ష్మీపతి పాత్ర ఆయన కెరియర్ ని మలుపు తిప్పింది. ఈ పాత్రలో ఆయన చెప్పే "నాకేంటి..?" అనే ఒక మాట ఇండస్ట్రీని ఏ రేంజ్ లో శాసించిందో అందరికీ తెలిసిందే . అలాంటి ఒక టాలెంట్ ఉన్న యాక్టర్ మన మధ్య లేకపోవడం నిజంగా సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం అంటూ కొంతమంది బాధపడుతున్నారు..!