కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో విజయ్ సేతుపతి ఒకరు . ఈయన తన కెరీయర్లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించాడు. ఇప్పటివరకు విజయ్ కేవలం హీరో పాత్రలో మాత్రమే కాకుండా అనేక సినిమాల్లో విలన్ పాత్రలలో నటించాడు. అలాగే కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఉప్పెన మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో విజయ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది. తాజాగా విజయ్ సేతుపతి సినిమా రివ్యూలపై , నెగిటివ్ కామెంట్స్ పై స్పందించాడు. తాజాగా విజయ్ సేతుపతి రివ్యూల గురించి మాట్లాడుతూ  ... సినిమాలను ప్రజలు చూసి ఆస్వాదించడానికి , ఆనందించడానికి విడుదల చేస్తాం అని ఆయన అన్నారు. కానీ ప్రేక్షకులు సినిమాలను ఎలా చూడాలో తాము అసలు చెప్పలేమని , అది పూర్తిగా వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అని విజయ్ చెప్పుకొచ్చాడు.

అలాగే ప్రేక్షకుల నుండి వచ్చిన కామెంట్స్ ను బేస్ చేసుకుని అప్డేట్ కావాలి అని కూడా ఆయన సూచించారు. ఇది ఇలా ఉంటే విజయ్ సేతుపతి కొంత కాలం క్రితం మహారాజా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయి రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొంత కాలం క్రితం ఈయన నటించిన ఏస్ అనే సినిమా విడుదల అయింది. కానీ ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తీవ్రంగా విఫలం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs