ఈ మధ్య కాలంలో మన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో చాలా మంది కూడా ఒక సినిమా తర్వాత మరొక సినిమాను పూర్తి చేయడానికి అత్యంత ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు. ఇక కొంత మంది ఒక సినిమా పూర్తి అయిన తర్వాత మరో సినిమాను మొదలు పెట్టడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటే మరి కొందరు సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత ఆ మూవీ ని పూర్తి చేయడానికి కూడా చాలా సమయాన్ని తీసుకుంటున్నారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరిర్ను కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి మాత్రం ఒక అదిరిపోయే జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.

ఈయన సినిమా పూర్తి అయిన తర్వాత మరో సినిమాను స్టార్ట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. అలాగే సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత దానిని పూర్తి చేయడంలో కూడా ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. కొంత కాలం క్రితం ఈయన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక కొంత కాలం క్రితమే చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా ఓ మూవీ ని మొదలు పెట్టాడు. ఆ మూవీ షూటింగ్ను కూడా జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం అక్టోబర్ నెల వరకు మొత్తం పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక అక్టోబర్ వరకు ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసి నవంబర్ , డిసెంబర్ , జనవరి ఈ మూడు నెలలు ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహించాలి అని అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అనిల్ సినిమా షూటింగ్ను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేయడం మాత్రమే కాకుండా ఆ మూవీ ప్రమోషన్లపై ఇప్పటి నుండే కాన్సన్ట్రేషన్ పెట్టడంతో అనిల్ ని చూసి చాలా మంది దర్శకులు అనేక విషయాలు నేర్చుకోవాలి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: