
స్టార్ హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్లు కళ్ళు చెదిరే రీతిలో ఉంటాయి. స్టార్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే దీనిపై ఎవరు ఓపెన్ గా మాట్లాడరు. ఎందుకంటే ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తుందని వారి బాధ. అయితే లోకేష్ కనకరాజ్ మాత్రం కూలీ సినిమాకు రు . 50 కోట్ల పారితో షకం తీసుకున్నట్టు ఓపెన్ గానే చెప్పారు. నా 50 కోట్ల పారితోషకం గురించి మీరు నన్ను అడగవచ్చు .. నేను తీసిన లియో సినిమా రు . 600 కోట్లు వసూళ్లు రాబట్టింది. అందుకే ఇప్పుడు నాకు ఇంత పారితోషం దక్కింది అని ఓపెన్ గానే చెబుతున్నట్టు లోకేష్ తెలిపారు. తాను పన్నులు చెల్లించాను అని .. జీవితంలో ఏదీ సులభంగా దక్కదు అని లోకేష్ చెబుతున్నారు. ఈ పారితోషకం మేనక తన జీవితంలో రెండు సంవత్సరాల త్యాగం ఉందని అంటున్నాడు.
త్యాగాలు చేసినప్పుడే విజయాలు వరిస్తాయని అంటున్నాడు, ఫ్రెండ్స్ - ఫ్యామిలీ - ఫంక్షన్లు ఇలా అన్ని వదులుకుని కష్టపడటం వల్లనే తాను సక్సెస్ అయ్యానని అంటున్నాడు. విజయం వచ్చిన ప్రతిసారి భారీ పారితోషకం తీసుకుంటానని అదే తన కష్టానికి తగిన ప్రతిఫలం అని అంటున్నాడు లోకేష్. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీసిన కూలీ సినిమా వచ్చే నెల 14న విడుదల కానుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు