
చేసేది కామెడీ రోల్స్.. ఆస్తులు ఏమో వందల కోట్లు.. బ్రహ్మానందం టోటల్ ప్రాపర్టీస్ వాల్యూ ఎంతో తెలుసా..!

అత్యధిక సినిమాలో నటించిన కమెడియన్గా గిన్నిస్ రికార్డులు కూడా సొంతం చేసుకున్నారు. "బ్రహ్మానందం" గారు 1986లో విడుదల అయిన "చంటబ్బాయి" అనే చిత్రం ద్వారా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన ఇప్పటికి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు . ఒకానొక సమయంలో సంవత్సరానికి 30 సినిమాలలో నటించారు అంటే ఆయన కామెడి టైమింగ్ ఎంత బాగుంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు . తెలుగులో ఆల్మోస్ట్ అన్ని ఆయన నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్సే. ఇప్పటికి నవ్వులు పూయిస్తూనే వస్తున్నారు బ్రహ్మానందం. ఇప్పుడు ఒక సినిమాకి రెండున్నర కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు అంటూ తెలుస్తుంది. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న కమెడియన్స్ లలో బ్రహ్మానందం నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు. 68 ఏళ్ల వయసులోను ఉత్సాహం తో వర్క్ చేస్తున్నారు. బహు భాషా చిత్రాలలో నటిస్తూ దట్ ఈజ్ బ్రహ్మానందం అంటూ ప్రూవ్ చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . 495 కోట్లకు పైగానే ఆయన ఆస్తులు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. కేవలం కామెడీ రోల్స్ చేస్తూనే ఇన్ని వందల కోట్ల సంపాదించాడు . కామెడీతో పాటు చిత్రలేఖణంలో కూడా ఆయన మంచి ప్రావీణ్యం సంపాదించారు. బ్రహ్మానందం కి హైదరాబాద్ , బెంగళూరు తో పాటు మర్కొన్ని చోట్ల ఆస్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మానందం ఎన్ని వందల కోట్ల ఆస్తి ఉన్న చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతుంటారు . ఇప్పటికి ఆయన తన పనిని తనే చేసుకుంటూ ఉంటారు . ఇంట్లో పని మనుషులు ఉన్నా కూడా తన పని తాను చేసుకోవడం ఆయనకి ఇష్టం . అంతేకాదు ఏ ఈవెంట్ కి వచ్చిన ఏ ఫంక్షన్ కి వచ్చిన అందరితో కలిసిపోయి మెలిగిపోతాడు . ఇలాంటి కమెడియన్ మన ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణం అంటున్నారు అభిమానులు..!