జెనీలియా 13 ఏళ్ల తర్వాత మళ్లీ దక్షిణాది సినిమాల్లో నటిస్తుంది. చాలా సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జెనీలియా కిరీటి శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న జూనియర్ మూవీలో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి నటిస్తున్న జూనియర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలోని వైరల్ వయ్యారి సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్  అందరూ ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా 13 ఏళ్ల తర్వాత మళ్ళీ సౌత్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఆ ఇంటర్వ్యూలో మీరు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సౌత్ ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నారు.ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు అంటూ ప్రశ్న ఎదురైంది. అయితే ఈ ప్రశ్నకు అందరూ షాక్ అయిపోయే ఆన్సర్ ఇచ్చింది జెనీలియా. అదేంటంటే.. జెనీలియా భర్త రితేష్ దేశముఖ్ టార్చర్ చేయడం వల్లే మళ్ళీ సౌత్ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చింది. దాదాపు మూడు సంవత్సరాల నుండి రితేష్ దేశ్ముఖ్ నన్ను టార్చర్ చేస్తున్నాడు. అందుకే మళ్ళీ సౌత్ లోకి రీ ఎంట్రీ ఇచ్చా అంటూ ఆన్సర్ ఇచ్చింది.

ప్రస్తుతం జైనీలియా చెప్పిన మాటలు వైరల్ గా మారడంతో చాలామంది  జెనీలియా అభిమానులు రితేష్ ని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది హీరోయిన్లకు పెళ్లిళ్లు అయ్యాక మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి  వాళ్ళ భర్తలు ఒప్పుకోరు. కానీ రితేష్ దేశ్ముఖ్ కు మాత్రం జెనీలియాకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వమని చెప్పడంతో అందరూ రితేష్ ని పొగుడుతున్నారు. ఇక జెనీలియా సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ నార్త్ ఇండస్ట్రీలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. ఇక 13 ఏళ్ల తర్వాత జెనీలియా సౌత్ ఇండస్ట్రీ లోకి  ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా చూడడానికి జెనీలియా ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: