మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి పూజ హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు అనేక భాషల సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆడి పాడి తెలుగులో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాత్రం ఎక్కువ శాతం తెలుగు సినిమాల్లో నటించడం లేదు. ఎక్కువగా తమిళ్ , హిందీ సినిమాల్లో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో మౌనిక అంటూ సాగే సాంగ్ చేసింది.  ఈ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియోను కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ సాంగ్లో పూజ హెగ్డే చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా పూజా హెగ్డే ఈ మూవీలోని మోనికా సాంగ్ గురించి , ఈ మూవీలోని సాంగ్ కోసం తాను ఎంత కష్టపడ్డాను అనే దాని గురించి స్పందించింది. తాజాగా పూజా హెగ్డే "కూలీ" మూవీలోని మౌనిక సాంగ్ గురించి మాట్లాడుతూ  ... ఇప్పటివరకు నేను ఎన్నో సాంగ్స్ చేశాను. కానీ నా కెరియర్ మొత్తంలో కూలీ మూవీలోని మౌనిక చాలా టఫ్ఫెస్ట్ సాంగ్.

చాలా ఎండలో గ్లామరస్ గా , ఎఫెక్ట్స్ లెస్ గా కనిపించేందుకు ఈ సాంగ్ కోసం చాలా శ్రమించా. ఈ సాంగ్ చేసే సమయంలో నా కాలు బెనికింది. అయినా కూడా ఈ సాంగ్ చేశా. కాలు బెణికిన తర్వాత నేను చేసిన మొట్ట మొదటి సాంగ్ ఇదే. ఈ సాంగ్ థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది అని పూజా హెగ్డే తాజాగా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా ... నాగార్జునమూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: