టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్దగా విజయాలు లేకపోయినా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో నీది అగర్వాల్ ఒకరు. ఈమె నాగ చైతన్య హీరో గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ మూవీ లో ఈమె తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా ద్వారా ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె మిస్టర్ మజ్ను అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

ఈమెకు మొట్ట మొదటి విజయం తెలుగులో ఈస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... ఏ ఏం రత్నం ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ ని జూలై 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తాజాగా నిధి అగర్వాల్ , పవన్ కళ్యాణ్ గురించి హరిహర వీరమల్లు సినిమాలో నటించడం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.

ఆయనకు అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వేరే వాళ్ళతో వంద సినిమాలు చేసిన ఒకటే , పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసిన ఒకటే. ఆయన ఎంతో గొప్ప నటుడు. పాత్రలో ఎంతో సులభంగా ఒదిగిపోతారు. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం అని నిధి అగర్వాల్ తెలియజేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కనుక మంచి విజయం అందుకున్నట్లయితే నీది అగర్వాల్ తెలుగులో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఫాలోయింగ్ వస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: