సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆఖరుగా పెట్టాయన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. రజనీ కాంత్ తాజాగా కూలీ అనే సినిమాలో హీరోగా నటించాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కూలీ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న రజని మరో వైపు జైలర్ 2 మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

ఇప్పటికే జైలర్ మూవీ మంచి విజయం సాధించడంతో జైలర్ 2 మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా ఓ మూవీ షూటింగ్ను పూర్తి చేసి మరో మూవీ షూటింగ్ తో చాలా బిజీగా ఉన్న రజనీ కాంత్ ఒక హీరో కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... తమిళ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటులలో కమల్ హాసన్ ఒకరు. కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం రూపొందిన భారతీయుడు మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఆ మూవీ కి కొనసాగింపుగా భారతీయుడు 2 అనే మూవీ ని రూపొందించారు. ఈ సినిమాను లైకా సంస్థ వారు నిర్మించారు. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయింది. ఇప్పటికే భారతీయుడు 3 కి సంబంధించిన షూటింగ్ కూడా సగ భాగం పూర్తి అయినట్లు తెలుస్తోంది.

కానీ భారతీయుడు 2 ఫ్లాప్ కావడంతో మిగిలిన భాగాన్ని రూపొందించడానికి లైకా సంస్థ పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఇక లైకా సంస్థ రజనీ కి చాలా క్లోజ్ కావడం , అలాగే కమల్ , శంకర్ కూడా క్లోజ్ కావడంతో ఆయన మధ్య వర్తిగా ఉండి మిగిలిన భారతీయుడు 3 సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి అందరిని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇలా రజిని "భారతీయుడు 3" తెలుగు సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: