
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కృష్ణానది తీరంలో కొల్లూరులో దొరికినటువంటి కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తానుల వద్దకు ఎలా వచ్చింది? దాని ప్రయాణం ఆ తర్వాత ఎటు వెళ్లిపోయిందనే నేపథ్యం నుంచే ఈ సినిమా కథ పుట్టుకొచ్చిందంటూ తెలియజేశారు. ఈ సినిమాకి పునాది వేసిన డైరెక్టర్ క్రిష్ కి ధన్యవాదాలని అలాగే కీరవాణి తన మ్యూజిక్ తో ఈ సినిమాకి ప్రాణం అందించారని హీరోయిన్ నిధి అగర్వాల్ అద్భుతంగా నటించిందని తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ హీరోయిన్ నిధి అగర్వాల్ చేస్తూ ఉంటే తనకే సిగ్గుగా అనిపించిందని ఈ సినిమాని తాను అనాథలా వదిలేసామా ? అనే ప్రశ్న తనలో మొదలయ్యిందని అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చానంటూ తెలిపారు పవన్ కళ్యాణ్.
ఈ చిత్రంలో బాబీ డియోల్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. మరో కొంతమంది నటీనటులు కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిర్మాత ఏ.ఎం.రత్నం అంటూ వెల్లడించారు. ఒక సినిమా నిర్మించాలి అంటే చాలా యుద్ధాలు చేయాలి, ఒడిదుడుకులను ఎదుర్కోవాలి , ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. పొలిటికల్గా వెళ్లిన తర్వాత సినిమాలకు అవకాశం ఇవ్వలేదు అయినా కూడా తనకు బెస్ట్ ఇచ్చారని తెలిపారు. ఈ సినిమాకి క్లైమాక్స్ అనేది ఆయువు పట్టు అంటూ తెలిపారు.