ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి అనుమతులు లభిస్తున్నా తెలంగాణలో మాత్రం  లభించడం లేదనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్  సినిమాకు మాత్రమే నిర్మాత  దిల్ రాజు అతి కష్టం మీద టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు తెచ్చుకున్నారు. అయితే హరిహర వీరమల్లు ఈ నెల 23వ తేదీ రాత్రి 9.30 గంటల నుంచి థియేటర్లలో ప్రదర్శితం కానుంది.

ఏపీలో ఈ సినిమా ప్రీమియర్ షోలకు టికెట్ రేట్లు 600 రూపాయలుగా  ఉండగా తెలంగాణాలో సైతం  టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి అనుమతులు లభించడం కొసమెరుపు.  ఈ నెల 23వ టీడిన 600 రూపాయల టికెట్ రేటుతో ప్రీమియర్ షోలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు  లభిస్తాయి.  అదే సమయంలో 27వ తేదీ వరకు మల్టిప్లెక్స్ లో  టికెట్ రేటుపై 200+జీఎస్టీ, సింగిల్ స్క్రీన్స్ లో 150+జీఎస్టీ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

ఈ వార్త మేకర్స్ కు శుభవార్త అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో సైతం హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపు దిశగా  ప్రయత్నాలు చేస్తామని చెప్పిన ఏఎం  రత్నం ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని సాధించారనే చెప్పాలి. జులై 28 నుంచి ఆగష్టు 2 వరకు 50 మల్టిప్లెక్స్ లో 150 + జీఎస్టీ, సింగిల్ థియేటర్లలో 106+జీఎస్టీ పెంపుగా ఉండనుంది.

తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 5 షోల చొప్పున హరిహర వీరమల్లు  ప్రదర్శితం కానుంది.  ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సరైన సినిమా లేక  మార్నింగ్ షో మాట్నీ ఫస్ట్ షో కి సింగిల్ స్క్రీన్స్ లో షోలు క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తోంది.  మల్టీప్లెక్స్ లలో మాత్రం హాలీవుడ్ సినిమాలు ప్రదర్శితం అయ్యాయి.  హరిహర వీరమల్లు సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం రెండు వారాల పాటు థియేటర్లు కళకళలాడే అవకాశాలు ఉంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: