ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటే , పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను జులై 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొన్నాడు. పవన్ నిన్న మధ్యాహ్నం పూట హరిహర వీరమల్లు సినిమా గురించి మీడియాతో ఇంట్రాక్షన్ అయ్యాడు.

అందులో భాగంగా చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాడు. ఆ సినిమా గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాను ఏ ఏం రత్నం నిర్మించాడు. ఏ  ఏం రత్నం గురించి ఈ మీడియా ఇంట్రాక్షన్ ను ఏర్పాటు చేశాను అని చెప్పి ఆయన గురించి ఎన్నో గొప్ప వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ చేశాడు. నిన్న రాత్రి ఈ మూవీ బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్  ను ఏర్పాటు చేసింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ మూవీ బృందంలోని అనేక మంది గురించి మాట్లాడి మళ్ళీ ఏ ఏం రత్నం గురించి గొప్పగా మాట్లాడాడు. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం tsfdc చైర్మన్ పదవిని ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజుకు ఇచ్చారు.

తాజాగా హరిహర వీరమల్లు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా apfdc చైర్మన్ పదవిని మంచి క్రేజ్ కలిగిన అలాగే సినిమా కోసం ఎంతో పాటుపడే నిర్మాత అయినటువంటి ఏ ఏం రత్నం గారికి ఇస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తున్నట్లు , అలాగే ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పినట్లు మరికొన్ని రోజుల్లోనే , అందుకు సంబంధించి మంచి వార్త వచ్చే అవకాశం ఉంది అని , కానీ నా ఒక్కడి చేతిలో ఏమీ ఉండదు. కేవలం నేను ఆయన పేరును సిఫారసు చేశాను అని పవన్ చెప్పుకొచ్చాడు. మరి ఏ ఏం రత్నం ap fdc చైర్మన్ పదవిని అందుకుంటా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: