టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న సీనియర్ నటులలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. ఎన్నో సంవత్సరాల క్రితం నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి ఎన్నో సినిమాల్లో విలన్ , ముఖ్య , కీలక , హీరో పాత్రలలో నటించి నటుడిగా తనకంటూ ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే మోహన్ బాబుకు కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రజనీ కాంత్ మంచి స్నేహితుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని మోహన్ బాబు అనేక సందర్భాలలో కూడా చెప్పుకొచ్చాడు.

కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ బాబు "పెద రాయుడు" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఆ మూవీ లో రజనీ కాంత్ , మోహన్ బాబు కు తండ్రి పాత్రలో నటించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ద్వారా మోహన్ బాబు , రజనీ కాంత్ ఇద్దరికీ అద్భుతమైన గుర్తింపు వచ్చింది. తాజాగా మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా రజనీ కాంత్ తో తనకున్న అనుబంధాన్ని , తాను రజనీ కాంత్ ను ఎలా పిలుస్తాను ... వారి మధ్య స్నేహ బంధం ఎలా ఏర్పడింది ఇలా అనేక విషయాల గురించి చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ ... రజనీ కాంత్ నా బెస్ట్ ఫ్రెండ్. అలాగే అతను బెస్ట్ హ్యూమన్ బీయింగ్ కూడా. నేను రజనీ కాంత్ ని బ్లడీ తలైవా అనే పిలిచే వాడిని. అది మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం. మేమిద్దరం కూడా సామాన్యులు గా ఉన్న సమయంలో మద్రాస్ ప్లాట్ ఫామ్ మీద కలిసాం. మేమిద్దరం కూడా ఎర్లీ డేస్ లో కలిసే ఉన్నాం. రోజు నాలుగు సార్లు మెసేజ్లు కూడా చేస్తాడు అని మోహన్ బాబు తాజాగా రజనీ కాంత్ తో తనకున్న స్నేహ బంధం గురించి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: