పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చాలా కాలం క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ మొదలు అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా కొంత కాలం పాటు ఈ మూవీ షూటింగ్ సాగాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ల హడావిడి మొదలు కావడంతో పవన్ వాటిపై దృష్టి పెట్టాడు.

దానితో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు ముగిసి చాలా కాలం కావడంతో పవన్ ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు , ఓజి సినిమాలో షూటింగ్లను కంప్లీట్ చేశాడు. పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. గత కొన్ని రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి అయినటువంటి రాశీ కన్నా కూడా నటిస్తుంది అని , ఆమె ఇప్పటికే సినిమా షూటింగ్లో కూడా జాయిన్ అయింది అని , మరికొన్ని రోజుల్లో అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అని ఓ వార్త తెగ వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాలో రాశి కన్నా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఆమెకు సంబంధించిన ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఈమె పొట్టి డ్రెస్ వేసుకొని అదిరిపోయే లుక్ లో ఉంది. రాశీ కన్నామూవీ లో శ్లోక అనే పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా ఈ మూవీ బృందం ఈ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ సినిమా విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rk