
ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్ని ఆశలు పెట్టుకున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు . దాదాపు 5 ఏళ్లకు పైగానే సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసుకుని అన్ని అవాంతరాలు ఎదుర్కొని రిలీక్ కి సిద్ధమైంది . మరి కొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . జూన్ 24వ తేదీ ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతుంది . ప్రీమియర్స్ వేసుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో జూలై 23 రాత్రి 9:30 నిమిషాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్స్ పడిపోతున్నాయి .
కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్. ఈవెంట్ లో కీరవాణి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. కీరవాణి ఆధ్వర్యంలో పలువురు గాయకులు పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమా టైటిల్ ని పాట రూపంలో మార్చి పాడారు. ఈ పాట చాలా చాలా హైలెట్ గా మారింది . "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి హరిహర వీరమల్లు" సినిమా వరకు ప్రతి సినిమా పేరుని హైలెట్ చేస్తూ తమదైన స్టైల్ లో గాయకులు పాటలు ఆలపించారు.
చాలా చక్కగా వినడానికి హాయిగా అనిపించింది. ఈ పాటను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు . కాగా అసలు కీరవాణికి ఇలాంటి థాట్ ఎలా వచ్చింది? ఇప్పటివరకు ఎవరు ఇలా చేయలేదు కదా..? అనే మాటలు బాగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం కీరవాణికి అసలు ఈ సజెషన్ ఇచ్చింది ఎస్ ఎస్ రాజమౌళి అంటూ తెలుస్తుంది . రాజమౌళి - పవన్ కళ్యాణ్ కి బిగ్ ఫ్యాన్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు బయటపెట్టాడు . ఆయన ఇచ్చిన సలహా మేరకే కీరవాణి ఇలా ఒక పాటను ఆయన సినిమా టైటిల్స్ తో కంపోజ్ చేశారట. గాయకులు డా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఆలపించారు . ఈ పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!