
ఏఎం రత్నం నిర్మించిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రమోషన్స్ ద్వారా మేకర్స్ మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ కూడా భాగం అయ్యారు. మొన్నీమధ్య ప్రెస్ మీట్, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సందడి చేసిన పవన్.. తాజాగా అమరావతిలో పలువురు విలేకరులతో చిట్ చాట్ చేశారు. వారు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పారు.
ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ హరిహర వీరమల్లు సినిమాను సీఎం చంద్రబాబు చూస్తారా? అని ప్రశ్నించగా.. `సీఎం గారు చాలా బిజీ. ఒకవేళ ఆయన సినిమాలు చూసిన ఐదు నిమిషాలు చూస్తారేమో. అయిన ఎందుకు రోజు నన్ను చూస్తుంటారు కదా.. సో సినిమా చూసినట్టే అనుకుంటారు` అనే పవన్ కళ్యాణ్ క్రేజీగా ఆన్సర్ ఇచ్చారు. మరొక రిపోర్టర్ మీ కో-ఎమ్మెల్యేలతో ఈ సినిమా చూసే ఆలోచన ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా.. `ఇంతవరకు నేను దాని గురించి ఆలోచించలేదు. ఈ ఐడియా కూడా బాగానే ఉంది. ఒకవేళ కూటమి ఎమ్మెల్యేలు కోరితే కచ్చితంగా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాము` అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.