హరిహర వీరమల్లు సినిమా చూసొచ్చిన చాలా మంది జనాలు పార్ట్-2 గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే చాలామంది యూట్యూబర్లు, మీడియా వాళ్ళు థియేటర్ల దగ్గరికి వెళ్లి మరీ సినిమా చూసి వచ్చాక జనాల అభిప్రాయాలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఎలాంటి రివ్యూలు ఇస్తారు అనేది వారిని అడిగి మరీ తెలుసుకుంటారు.. ఈ నేపథ్యంలోనే సినిమా చూసి వచ్చిన నిర్మాత ఏఎం రత్నంని ఓ ఛానల్ రిపోర్టర్ హరి హర వీరమల్లు పార్ట్ -2 గురించి ప్రశ్న అడగగా నిర్మాత ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ కి అందరికీ దిమ్మ తిరిగింది.మరి ఇంతకీ ఆయన ఏమని సమాధానం ఇచ్చారు..పార్ట్-2 రావడం కలేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. పవన్ కళ్యాణ్,నిధి అగర్వాల్ జంటగా.. బాబి డియోల్ విలన్ గా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన హరిహర వీరమల్లు మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 24న విడుదలైన సంగతి మనకు తెలిసిందే. 

ఇక ఒకరోజు ముందే అర్ధరాత్రి నుండి హరిహర వీరమల్లు  ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. ఇప్పటికే సినిమా చూసిన జనాలు కొన్ని నెగెటివ్ పాయింట్లు, కొన్ని పాజిటివ్ పాయింట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సినిమాని పూర్తిగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తే సినిమా మరింత అద్భుతంగా ఉండేదని, కానీ జ్యోతి కృష్ణ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడంతో కొన్ని సీన్స్ బాలేవని అంటున్నారు. అలాగే పూర్ విఎఫ్ఎక్స్ కారణంగా సినిమాకి దెబ్బ పడింది అని అంటున్నారు. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేశారని,నిధి అగర్వాల్ గ్లామర్ కలిసి వచ్చిందని చెప్పుకుంటున్నారు. బాబీ డియోల్ పాత్ర కూడా అద్భుతంగా ఉంది అని రివ్యులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ బాబి డియోల్ ని కలిసి యుద్ధం జరగకముందే పార్ట్ 1 ని ముగించేశారు.

ఇక క్లైమాక్స్ లో యుద్ధభూమి అనే నేమ్ కార్డు వేసి యుద్ధభూమిలో కలుద్దాం అన్నట్లుగా క్లైమాక్స్ లో చెప్పేశారు. దీంతో సెకండ్ పార్ట్ ని యుద్ధభూమి అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో హరిహర వీరమల్లు పార్ట్ 2 కి సంబంధించి ఓ 20 నిమిషాల షూట్ చేశామని చెప్పింది.. అయితే పార్ట్-2 గురించి తాజాగా సినిమా చూసి వచ్చిన ఏఎం రత్నంని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా ముందు హరిహర వీరమల్లు సినిమా హిట్ అయితే చూద్దాంలే అన్నట్లుగా నిర్మాత ఆన్సర్ ఇవ్వడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం నిర్మాతకి కూడా లేదని, అందుకే ఆయన అలాంటి ఆన్సర్ ఇచ్చారని హరిహర వీరమల్లు సినిమా హిట్ అయితేనే పార్ట్ -2 గురించి ఆలోచన చేస్తామని నిర్మాత ఇచ్చిన ఆన్సర్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఏది ఏమైనప్పటికీ నిర్మాత ఇచ్చిన ఆన్సర్ మాత్రం అస్సలు బాలేదని మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: