
నాగార్జున మూవీ అనగానే ప్రేమ కథాంశం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారని ఇందులో మిస్ అయిందని ఆయన తెలిపారు. ధనుష్ రష్మిక కలిసి నటించినా వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా నిడివి మూవీ కలెక్షన్లు తగ్గడానికి కారణమైందని ప్రస్తుతం 3 గంటల నిడివి అంటే ఎక్కువని ఆయన చెప్పుకొచ్చారు. మెయిన్ విలన్ తో కలిసిపోయిన దీపక్ కు దేవా దొరికిపోతాడేమో అనే సస్పెన్స్ ను బాగా మెయింటైన్ చేశారని ఆయన పేర్కొన్నారు.
హీరో కాబట్టి ఆ డబ్బు ఎక్కడుందో కనిపెడతాడని అలా చేయకపోతే హీరోయిజం ఉండదని వేల కోట్ల రూపాయలు దొరికితే చాలామంది విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతారని ఇందులో హీరోకు కానీ హీరోయిన్ కు కానీ అలాంటి ఆశలు లేవని పేర్కొన్నారు. దేవా యాచకుల గురించే ఆలోచిస్తాడని అందువల్ల మిగతా పాత్రలు అతడిని పిచ్చివాడు అని అనుకుంటాయని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
దేవా చెప్పిన దానికి దీపక్ ఒప్పుకోకుండా ఉండి ఉంటే సినిమా అంత సక్సెస్ సాధించేది కాదని దీపక్ పోలీసుల సాయంతో ముందుకెళ్లి ఉంటే ఆ పాత్రను చంపే అవసరం వచ్చేది కాదని ఆయన తెలిపారు. ఆ కోణంలో చూపించి ఉంటే సినిమా ఇంకా ఎక్కువగా సక్సెస్ సాధించేదని ఆయన తెలిపారు. ఈ సినిమాను ట్రిమ్ చేసి ఉంటే మరో 60 కోట్లు వచ్చేవని ఆయన చెప్పుకొచ్చారు.