బాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "వార్" చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న "వార్ 2" సినిమాపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలున్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ సంచలనం జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "వార్ 2" ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు, జూలై 25, 2025న విడుదల చేశారు. ట్రైలర్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉంది.

 ఈ ట్రైలర్‌లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అతను ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించడం, ఫైటర్ జెట్స్‌లో కనిపించే సన్నివేశాలు అభిమానులకు పండగలా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

"వార్ 2" ప్రపంచవ్యాప్తంగా 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. భారత స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు విడుదల కావడంతో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది.  టీజర్ విడుదలైనప్పుడు ఎన్టీఆర్‌కు తక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారన్న విమర్శలు వచ్చినప్పటికీ, తాజా ట్రైలర్ లో హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ లకు సమ ప్రాధాన్యత దక్కింది. ఈ సినిమా  తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు.

మొత్తంగా, "వార్ 2" ఒక యాక్షన్ ఫీస్ట్ అవుతుందని, హృతిక్ మరియు ఎన్టీఆర్ మధ్య యుద్ధం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వార్2 సినిమాను దేశవ్యాప్తంగా డాల్బీ అట్మోస్  థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఈ రికార్డును అందుకున్న తోలి సినిమా వార్2 కావడం గమనార్హం.   యశ్  రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో  స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కి విడుదలవుతున్న  ఆరో సినిమాసినిమా కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: