టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఈయన జోష్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ సినిమా చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత నాగ చైతన్యమాయ చేసావే అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటివరకు నాగ చైతన్య అనేక సినిమాలలో నటించి ఎన్నో మంచి విజయాలను అనుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆఖరుగా చైతన్య "తండెల్" అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ ద్వారా కూడా చైతన్య మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. ఇకపోతే నాగ చైతన్య హీరో గా ఎంట్రీ ఇచ్చిన జోష్ మూవీ లో ఆయనకు స్నేహితురాలి పాత్రలో ఓ ముద్దుగుమ్మ నటించింది ఆమె గుర్తుందా..? ఆమె జోష్ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఆ మూవీ ద్వారా ఈమె మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ నటి పేరు శ్రేయ ధన్వంతరి. జోష్ సినిమాలో మంచి పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ఎక్కువ సినిమాల్లో నటించలేదు. 

ఈమె కొంత కాలం క్రితం స్నేహ గీతం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు ఫొటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక జోష్ మూవీ లో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో మాత్రం తన అందాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sd