
మరీ ముఖ్యంగా ప్రీమియర్స్ కి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు . మొత్తానికి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యింది . సూపర్ సూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతా సవ్యంగా సాగిపోతుంది అని అనుకునే లోపు అడపదడపా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ సినిమాకి దరిద్రంగా మారాయి అన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి మూమెంట్లోనే యూకే లోని ఓ థియేటర్లో అభిమానులు సందడి వివాదంగా మారింది. అక్కడ ప్రేక్షకులు పేపర్లు విసురుతూ భారీగా కేరింతలతో సినిమాను ఎంజాయ్ చేస్తున్న సమయంలో థియేటర్స్ సిబ్బంది ఒక్కసారిగా సినిమా స్క్రీనింగ్ ఆపేశారు. అసలు ఏం జరుగుతుంది ..? ఇక్కడ అంటూ షాక్ అయిపోయారు . ఇది పవన్ కళ్యాణ్ సినిమా అని తెలిసి కూడా వాళ్ళు థియేటర్ సైలెంట్ గా ఉంటుందని ఎలా అనుకున్నారో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
పవన్ కళ్యాణ్ తెరపై కనిపించగానే విజిల్స్ తో చప్పట్లతో థియేటర్ మారు మ్రోగిపోయేలా చేసేసారు అక్కడ అభిమానులు . అయితే వెంటనే ఏదో గందరగోళం జరుగుతుంది అంటూ భయపడి సినిమా ప్రదర్శన ఆపేసింది యాజమాన్యం . సిబ్బందికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు హాల్లోకి వచ్చి ప్రేక్షకులతో వాగ్వాదానికి దిగారు . ఈ మొత్తం సంఘటనను ఎవరో అక్కడ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు . స్క్రీన్ మీద సినిమా నిలిపివేయబడింది అని స్పష్టంగా కనిపిస్తుంది . అయితే దీనిపై జనాలు భిన్నంగా స్పందిస్తున్నారు . పవన్ కళ్యాణ్ సినిమా చూస్తూ చప్పట్లు కొడితే తప్పేంటి..? అని ఒకరు అంటుంటే అదే ఇండియాలో అయితే వేరే లెవెల్ లో ఉండేది సీన్..పవన్ కళ్యాణ్ సినిమా ని జోబులో చేతులు పెట్టి చూస్తారా.. విజిల్స్ చప్పట్లుతో మారుమ్రోగిపోవాల్సిందే మా అన్న బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!