
కలెక్షన్స్ పరంగా కూడా మంచిగా ముందుకు వెళ్తుంది. అయితే కొంతమంది పని పాట లేని బ్యాచ్ మాత్రం హరిహర వీరమల్లు గురించి నెగిటివ్గా మాట్లాడుతూ వస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ లేదు అని మొత్తం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నే ఉంది అని.. ఆయన క్యారెక్టర్ వేస్ట్ అని కొంతమంది అయితే ఏకంగా అసలు పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ సినిమాలో ఉన్నారని ..మిగతా నటీనటులకు ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అంటూ కావాలనే పవన్ కళ్యాణ్ని వెలెత్తి చూపేలా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు . ఇక ఒక బ్యాచ్ అయితే సోషల్ మీడియాలో నానా రాద్ధంతం సృష్టించింది .
ఇవన్నీ పక్కనపడితే హరిహర వీరమల్లు గురించి అందరూ నెగిటివ్గా మాట్లాడుకున్న ఒకే ఒక్క పాయింట్ వి ఎఫ్ ఎక్స్ . ప్రతి ఒక్కరు కూడా ఈ వీ ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ బాగోలేవు అంటూ మాట్లాడుకున్నారు. ఫ్యాన్స్ కూడా దానికి అంగీకారం తెలిపారు . కొంచెం ఇది మాత్రం హరిహర వీరమల్లు సినిమాకి నెగిటివ్ టాక్ తెచ్చేలా ఉంది అంటూ బాధపడ్డారు. అయితే గతంలో సేమ్ ఇదే మాదిరి ప్రభాస్ కూడా విఎఫ్ఎక్స్ కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు . ఆ సినిమా మరేంటో కాదు "ఆది పురుష్".
ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన "ఆది పురుష్" సినిమాలో విఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి అని .. ప్రభాస్ ని జోకర్ చేసి చూపించారు అని ..అప్పట్లో రెబెల్ ఫాన్స్ కూడా మండిపడ్డారు . అంతేకాదు ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏకంగా అందరు ముందే ఓం రావత్ పై కోప్పడిన దృశ్యాలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . ఎప్పుడు సైలెంట్ గా ఉండే ప్రభాస్ కి ఇంత కోపం ఎందుకు వచ్చింది అంటూ అప్పట్లో నేషనల్ మీడియాలో కూడా వార్తలు వినిపించాయి . ఇక ఆ తర్వాత ఎంత వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ ని మార్చిన ట్రోలింగ్ మాత్రం ఆపలేకపోయారు మూవీ మేకర్స్. ఆ తర్వాత సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది . కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించిన టాక్ మాత్రం వెరీ వెరీ బ్యాడ్ అంటూ ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ వి ఎఫ్ ఎక్స్ కారణంగానే హరిహర వీరమల్లు ని కూడా ట్రోల్ చేస్తున్నారు..!!