
తెలుగులో ఘరానా మొగుడు, హిట్లర్, చెన్నకేశవ రెడ్డి, గుడుంబా శంకర్ వంటి అనేక చిత్రాలలో నటించి ఈ నటుడు ప్రేక్షకుల మెప్పు పొందారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఆయనకు మెగాస్టార్ చిరంజీవి ఆర్థికంగా సాయం చేసి ఆదుకున్నారు. అయితే ఈ నటుడు తాజాగా ఒక సందర్భంలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఘరానా మొగుడు సినిమాతో పొన్నాంబళం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా ఇప్పటివరకు ఈ నటుడు 1500కు పైగా సినిమాలలో నటించారు. కిడ్నీ సమస్యలు ఎదురైన సమయంలో నాలుగేళ్లలో 750కు పైగా ఇంజెక్షన్లు వేశారని ఆయన తెలిపారు. రెండు రోజులకు ఒకసారి రెండు ఇంజక్షన్లు వేసి శరీరంలోని రక్తాన్ని తీసి డయాలసిస్ చేసేవారని ఆయన వెల్లడించారు. పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదని ఆయన తెలిపారు.
మద్యం ఎక్కువగా సేవించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తాను మద్యం మానేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. తానూ చేసిన తప్పు ఎవరూ చేయొద్దంటూ పొన్నాంబళం వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు