పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయింది. పవన్ ఈ సినిమా స్టార్ట్ అయ్యాక భీమ్లా నాయక్ , బ్రో సినిమాలను కంప్లీట్ చేయగా , క్రిష్ "కొండపొలం" అనే సినిమాను కంప్లీట్ చేశాడు. హరిహర వీరమల్లు సినిమా పలుమార్లు ఆగిపోతూ స్టార్ట్ కావడంతో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ తప్పుకున్నాడు. దానితో హరిహర వీరమల్లు మూవీ నిర్మాత అయినటువంటి ఏ ఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగం షూటింగును పూర్తి చేశాడు.

మూవీ జూలై 24 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ లభించిన రెండవ రోజు ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గాయి. దానితో ఈ సినిమా కలెక్షన్లు మళ్ళీ పుంజుకుంటాయా లేదా అని కొంత మంది భావించారు. అలాంటి సమయంలో నిన్న అనగా ఆదివారం రోజు హాలిడే కావడంతో ఈ సినిమా కలెక్షన్లు చాలా వరకు పుంజుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రోజు ఈ మూవీ కి పెద్ద ఎత్తున కలెక్షన్లు రిపోర్టు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి అత్యంత భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి నెగిటివ్ టాక్ వచ్చిన మొదటి రోజు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. విడుదల తర్వాత రోజు ఈ సినిమా కలెక్షన్లు కాస్త తగిన మళ్ళీ ఆదివారం రోజు ఈ మూవీ కలెక్షన్లు భారీగా పంచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: