కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగించిన వారిలో జెనీలియా ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించింది. అలాగే ఎన్నో విజయాలను కూడా అందుకుంది. ఈమె ఒకానొక సమయంలో తన అందాలతో , నటనతో తెలుగు కుర్రకారు మనసు దోచుకుంది. ఈమె కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ నటుడు అయినటువంటి రితేష్ దేశ్ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. జెనీలియా వివాహం తర్వాత సినిమాలకు చాలా కాలం పాటు దూరంగా ఉంది.

ఈమె చాలా సంవత్సరాల తర్వాత ఆమీర్ ఖాన్ హీరో గా రూపొందిన సితారే జమీన్ పర్ అనే సినిమాతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పర్వాలేదు అనే రీతిలో ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా కిరీటి రెడ్డి హీరో గా శ్రీ లీల హీరోయిన్గా జూనియర్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా జెనీలియా నటించింది. ఈ మూవీ ద్వారా జెనీలియా క్రేజ్ మరింతగా పెరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా జెనీలియా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

అందులో భాగంగా తన ప్రేమ , పెళ్లి గురించి అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా జెనీలియా మాట్లాడుతూ ...   నేను , రితేష్ ఇద్దరము ఒక సినిమా షూటింగ్లో మొదటి సారి కలుసుకున్నాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం కాస్త ప్రేమలా మారింది. మేము ప్రేమించు కోవడం మొదలు పెట్టాక 10 సంవత్సరాల పాటు డేటింగ్ చేశాం. ఆ తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం అని జెనీలియా తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది. ఇకపోతే జెనీలియా ఇకపై వరుస పెట్టి సినిమాలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి రెండవ ఇన్నింగ్స్ లో జెనీలియా ఏ స్థాయి సక్సెస్ను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: