పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నిధి అగర్వాల్ హీరోయిన్గా హరిహర వీరమల్లు అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయింది. ఈ సినిమా షూటింగ్ చాలా డిలే కావడంతో ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన భాగం షూటింగును పూర్తి చేశాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా ... ఏ ఎం రత్నం ఈ మూవీ ని నిర్మించాడు. బాబీ డియోల్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూలై 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర  మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 54.02 కోట్ల షేర్ ... 78.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఇక ఈ మూవీ కి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 65.02 కోట్ల షేర్ ... 105.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్గా నిలవాలి అంటే మరో 62.48 కోట్ల షేర్ కలెక్షన్లను  ప్రపంచ వ్యాప్తంగా రాబట్ట వలసి ఉంది. మరి ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: