టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన కింగ్డమ్ సినిమా జులై 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. అలాగే ఈ మూవీ యొక్క రన్ టైం ను కూడా లాక్ చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ సినిమా 160 నిమిషాల నిడివితో అనగా 2 గంటల 40 నిమిషాల రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిన్న రాత్రి ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పెద్ద ఎత్తున నిర్వహించింది.

కొంత కాలం క్రితం ఈ మూవీ నిర్మాత అయినటువంటి నాగ వంశీ మాట్లాడుతూ ... కింగ్డమ్ సినిమాని రెండు భాగాలలో పూర్తి చేయబోతున్నాము. ఈ సినిమా మొదటి భాగం మంచి విజయం సాధించినట్లయితే ఈ సినిమా రెండవ భాగాన్ని మొదలు పెడతాం అని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మూవీ మొదటి భాగం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో , ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd