టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ రేపు అనగా జూలై 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను ఈ రోజు అనగా జూలై 30 వ తేదీన "యూ ఎస్ ఏ" లో ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అలాగే ఇందుకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యి చాలా రోజులే అవుతుంది. ఈ మూవీ "యూ ఎస్ ఏ" ప్రీమియర్స్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తోంది.

ఇప్పటివరకు ఈ సినిమా "యూ ఎస్ ఏ" ప్రీమియర్స్ కి సంబంధించిన 20 వేల ప్లస్ టిక్కెట్లు సేల్ అయినట్లు , ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా ఈ మూవీ ప్రీమియర్స్ ఫ్రీ సేల్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించినట్లు దీని ద్వారా క్లియర్ గా అర్థం అవుతుంది. ఒక వేళ ఈ సినిమాకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ కి "యూ ఎస్ ఏ" లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో , ఏ స్థాయి కలెక్షన్లను వసులు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. 

మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ మొదటి భాగంకు వచ్చే రెస్పాన్స్ బట్టి రెండవ భాగాన్ని రూపొందించనున్నట్లు నాగ వంశీ కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd