
విజయ్ దేవరకొండ కొంత కాలం క్రితం ఖుషి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... శివ నిర్వాణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు మొదటి రోజు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 9.87 కోట్ల షేర్ కలక్షన్లు దక్కాయి. ఇక విజయ్ దేవరకొండ కొంత కాలం క్రితం హీరోగా నటించిన లైగర్ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.57 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా కూడా మొదటి రోజు కలెక్షన్ల విషయంలో అదిరిపోయే రేంజ్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. ఇకపోతే కింగ్డమ్ సినిమా ఈ రెండు సినిమాల మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్లను దాటి వేస్తుందా ..? లేక ఈ రెండు సినిమాల కలెక్షన్ల కంటే ఎక్కువ కలెక్షన్లను రాబడుతుందా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి కింగ్డమ్ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.