విజయ్ దేవరకొండ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చూపులు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల ఆయన మొదటి రోజే మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా 2016 వ సంవత్సరం జూలై 29 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమా ఆ సమయంలో ఎన్ని కోట్ల లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా నైజాం ఏరియాలో 5.30 కోట్ల కలెక్షన్లను రాబట్టగా , సీడెడ్ ఏరియాలో 70 లక్షలు , ఉత్తరాంధ్రలో 75 లక్షలు , ఈస్ట్ లో 58 లక్షలు , వెస్ట్ లో 25 లక్షలు , గుంటూరులో 62 లక్షలు , కృష్ణ లో 90 లక్షలు , నెల్లూరులో 20 లక్షల కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 9.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి 1.94 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 4.49 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 15.73 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకి 1.57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 15.73 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. దానితో ఈ మూవీ 14.16 కోట్ల లాభాలను అందుకొని ఆ సమయంలో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd