టాలీవుడ్ హీరో నాగార్జున, హీరోయిన్ రమ్యకృష్ణ, మరొక హీరోయిన్ ఇషా కొప్పికర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం చంద్రలేఖ. డైరెక్టర్ కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఒక సంఘటన గురించి హీరోయిన్ ఇషా కొప్పికర్ తాజాగా తెలియజేసింది. ఇందులో ఒక సన్నివేశం బాగా రావడానికి నాగార్జునతో కావాలనే తాను చెంపదెబ్బలు తిన్నానని తెలియజేసింది.



చంద్రలేఖ సినిమా తనకు రెండవ చిత్రమని ఇందులో నాగార్జున తనని కోపంగా కొట్టే ఒక సన్నివేశం ఉన్నది.. అందులో సీన్ బాగా రావడం కోసం నాగార్జున గారితో నిజంగానే చెంపదెబ్బలు తిన్నానని.. మొదట్లో తనని చాలా చిన్నగా కొట్టారు.అయితే ఆ సన్నివేశం సరిగ్గా రాకపోవడంతో.. తనకు కూడా కోపం రాలేదని గట్టిగా కొట్టండి అని చెప్పానని తెలిపింది.. ఆ సీన్ సరిగ్గా రావడం కోసం చాలానే రీటేకులు తీసుకున్నామని సుమారుగా 15 సార్ల వరకు తన చెంప పైన నాగార్జున గట్టిగా కొట్టారని తెలిపింది ఇషా కొప్పికర్.


దీంతో ఆ సన్నివేశం పూర్తి అయ్యాక చూస్తే ముఖమంతా కందిపోయింది. చెంప మీద చాలా వాతలు కనిపించాయి. నాగార్జున గారు కూడా ఈ విషయం పైన బాధపడి తనకి క్షమాపణలు చెప్పారని కానీ తను మాత్రం వద్దని వారించానని తెలిపింది. సన్నివేశం ఏదైనా డిమాండ్ చేస్తే ఇలాంటివన్నీ కూడా సహజంగానే నటిస్తామంటూ తెలిపింది. 1997లో వైఫ్ ఆఫ్ వరప్రసాద్ అనే చిత్రం ద్వారా అతిథి పాత్రలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇషా రెండవ చిత్రం నాగార్జునతో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. తర్వాత తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ వంటి భాషలలో కూడా నటించి మంచి క్రేజ్ అందుకుంది. 2017లో కూడా హీరో నిఖిల్ నటించిన కేశవ అనే చిత్రంలో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: