ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి స్థానం శాశ్వతం కాదు అని చెప్పడానికి ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దానికి మరో బిగ్ ఎగ్జాంపుల్ గా మారింది శ్రీ లీల . నిన్న మొదటి వరకు శ్రీలీల అంటే ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ . కత్తిలాంటి ఫిగర్ . నాటి బ్యూటీ . గిరగిరా నడుమును తిప్పేస్తుంది . డాన్సింగ్ క్వీన్ అంటూ రకరకాలుగా పొగిడేవారు జనాలు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే విధంగా పొగుడుతున్నారు కానీ ఆఫర్స్ మాత్రమే ఇవ్వడం లేదు.  గతంలో ప్రతి సినిమాలోనూ శ్రీలీలను హీరోయిన్గా చూస్ చేసుకోవాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేసేవారు . అంతలా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ముందుకు వెళ్ళింది. మేకర్స్ కూడా అంతే దేవతల భావించారు శ్రీలీల ని అని చెప్పుకోవడం లో సందేహం లేదు.


అయితే ఆమె కెరియర్ ని ఆమె చేతులారా నాశనం చేసుకుంటూ వచ్చింది. కొన్ని సినిమాలకి కమిట్ అవ్వడం ఆ తర్వాత కొన్ని కారణాల చేత అవి రిజెక్ట్ చేయడం .. తర్వాత ఎగ్జామ్స్ అంటూ కొన్ని సినిమాలను దూరం చేసుకోవడం ..ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాక పూర్తిగా టాలీవుడ్ హీరోలను మరిచిపోవడం ..హద్దులు మీరిన సీన్స్ చేయడంతో శ్రీలీల క్రేజ్ కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది.  ఇదే క్రమంలో రీసెంట్గా వచ్చిన వైరల్ వయ్యారి పాటలో ఆమె హాట్ ఎక్స్ప్రెషన్స్ కుర్రాళ్ళను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.

 

అయితే ఆమె అభిమానులను మాత్రం బాగా ఇబ్బంది పెట్టాయి . కాగా ఇప్పుడు శ్రీలీల చేయాల్సిన రెండు బడా ప్రాజెక్ట్స్ లో మరో యంగ్ బ్యూటీ వచ్చి చేరినట్లు తెలుస్తుంది . ఆమె మరెవరో కాదు "రుక్మిణి వసంత్". బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ఆఫర్లతో దూసుకుపోతుంది . రీసెంట్గా శ్రీలీల చేయాల్సిన రెండు బిగ్ బడా ప్రాజెక్ట్స్ లో శ్రీలీలని తీసేసి రుక్మిణి వసంత్ ని చూస్ చేసుకున్నారట మూవీ మేకర్స్. దీంతో శ్రీలీల స్థానాన్ని మెల్లమెల్లగా కైవసం చేసుకోవాలని చూస్తుంది రుక్మిణి వసంత్ అని మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు రుక్మిణి వసంత్ ఇప్పుడు బడా పాన్  స్టార్స్ సినిమాలలో నటిస్తుంది . నెమ్మదిగా శ్రీలీలను తొక్కేస్తుంది ఈ రుక్మిణి వసంత్ అని మాట్లాడుకుంటున్నారు అభిమానులు.  ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది . ఈ సినిమా హిట్ అయితే ఇక శ్రీ లీల స్థానాన్ని పూర్తిగా కైవసం చేసుకున్నట్లే అంటున్నారు అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: