తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలతో సరిసమానమైన క్రేజ్ను సంపాదించుకున్న అతి కొద్ది మంది బ్యూటీలలో అనుష్క శెట్టి ఒకరు. ఈమె నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఇందులో అనుష్క తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు ఎన్నో క్రేజీ సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి.

అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్న ఈమె అత్యంత తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఈ మధ్య కాలంలో మాత్రం అనుష్క గ్లామర్ షో కి ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించడం కంటే కూడా అద్భుతమైన నటనకు స్కోప్ ఉన్న సినిమాల్లోనే నటించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. కొంత కాలం క్రితం అనుష్క , జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటి అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ విడుదలపై ఇప్పటికి పెద్ద స్థాయిలో సస్పెన్స్ నెలకొనే ఉంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా ఆ తేదీన విడుదల కావడం కష్టం అని ఓ వార్త వైరల్ అవుతుంది. అందుకు ప్రధాన కారణం ఆ తేదీ దరిదాపుల్లో అనేక సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో ఘాటి మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన కాకుండా అక్టోబర్ , నవంబర్ లేదా డిసెంబర్ లో పెద్దగా సినిమాలు లేని సమయంలో విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: