
బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన నటించిన సినిమాలలో ఐదు సినిమాలకు నార్త్ అమెరికాలో 1 మిలియన్ కలెక్షన్లు దక్కాయి. ఇక టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ నిన్న అనగా జూలై 31 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాతో ఇప్పటివరకు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఐదు సినిమాలు నార్త్ అమెరికాలో 1 మిలియన్ కలెక్షన్లను సాధించాయి. దానితో ఇప్పటివరకు నార్త్ అమెరికాలో 1 మిలియన్ కలెక్షన్లను ఐదు సార్లు సాధించిన టాలీవుడ్ హీరోల లిస్టులో బాలయ్య తో సరి సమాన స్థితిలో విజయ్ దేవరకొండ నిలిచాడు. ఇది ఇలా ఉంటే నిన్న విడుదల అయిన కింగ్డమ్ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు.