ఇండస్ట్రీలో ఒక క్రేజీ హీరోయిన్ తమిళ్ ,తెలుగు, హిందీ వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించింది.. అయితే తన మొదటి చిత్రంతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తమిళ సినీ ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేసింది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఒక హీరోని ప్రేమించి వివాహం చేసుకుంది .. ఆ హీరోయిన్ ఎవరో కాదు ముంబై ప్రాంతానికి చెందిన సయేషా సైగల్.


సయేషా తమిళ హీరో ఆర్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2019లో వీరిద్దరి వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. కానీ వీరిద్దరి మధ్య వయసు తేడా సుమారుగా పదహారేళ్ళ తేడా ఉంటుందట. ముంబై ప్రాంతానికి చెందిన సయేషా సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ కి చెందిన హీరోయిన్. ఈమెకు కూడా నటన పైన ఆసక్తి ఉండడంతో 2005లో సూర్య నటించిన గజినీ చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా కనిపించింది. ఆ తర్వాత తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ వంటి భాషలలో కూడా నటించింది.


అఖిల్ నటించిన అఖిల్ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ గా మూట కట్టుకున్నప్పటికీ తన ఫస్ట్ సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించింది. ఆ తర్వాత తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించిన సయేషా.. ఆర్య సరసన గజినీకాంత్ అనే చిత్రంలో నటించిన ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడి ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నారు. అలా 2019లో వివాహం చేసుకోగా వీరికి ఒక పాప కూడా జన్మించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వైవాహిక బంధాన్ని ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: