"రేణుదేశాయ్" .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్గా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా రేణు దేశాయ్ ఒక మంచి మనిషి అంటూ చాలామంది పొగిడేస్తూ ఉంటారు.  ఆమె మూగజీవుల పట్ల ఎంత ప్రేమ చూపిస్తుంది అనేది అందరికీ తెలిసిందే . అంతే కాదు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ సమాజానికి ఉపయోగపడే పోస్టులు అదేవిధంగా తన పిల్లలకు సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు బయటకు చెబుతూ ఉంటుంది . జంతు ప్రేమికురాలు అయిన రేణుదేశాయ్ ఇటీవల తన కూతురు ఆధ్యా పేరుతో ఒక పెట్ షెల్టర్ కూడా ప్రారంభించింది . దీని ద్వారా ఎన్నో మూగజీవులను ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది .


కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ పెద్ద దుమారమే రేపుతుంది . రేణు దేశాయ్ తన పోస్టులో రాసుకోస్తూ .."ఒక కుక్క మనిషిని కరిచింది అని .. ఏ పాపం చేయని మిగతా అన్ని కుక్కలను చంపేయడం ఎంత అన్యాయం.. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు.  అదే సమాజంలో రేపిస్టులు, మర్డర్ చేసిన వారు మాత్రం మన చుట్టూ జాలీగా స్వేచ్ఛగా తిరుగుతుంటారు . ఇది ఎక్కడి న్యాయం..? రేపిస్టులు , దొంగలు చెత్త వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే.. ప్రజలు ఏం పట్టించుకోరు . అలాంటి వారి మధ్యనే తిరుగుతుంటారు . కానీ మూగజీవాలు ఉన్నాయని పిల్లలను వీధిలోకి తీసుకురావడానికి భయమేస్తుంది అంటూ ఉంటారు కొంతమ్మది. అది విన్నప్పుడు చాలా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది" అంటూ రాసుకొచ్చింది. అలాగే వీధి కుక్కల ఫోటోలను కూడా షేర్ చేసింది .


ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్ట్ కి సపోర్ట్ చేస్తూ చాలా మంది.." నిజమే కొంతమంది చెత్త నా కొడుకులు కుక్కలను కూడా వదలడం లేదు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు " అంటూ గతంలో వీధి కుక్కలను దారుణ దారుణంగా హింసించిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ పట్ల పాజిటివ్ - నెగిటివ్ కామెంట్స్ రెండు వినిపిస్తున్నాయి . కొంతమంది ఆమెను పోగొడుతుంటే.. మరి కొందరు మాత్రం మనుషులు - కుక్కలు ఒకటేనా..? ఏం మాట్లాడుతున్నారు మేడం ..అర్థమవుతుందా..? అంటూ మండిపడుతున్నారు..!


మరింత సమాచారం తెలుసుకోండి: