
గేమ్ చేంజర్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా కియారా అద్వానీ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యింది. భారీ అచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా కూడా నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ద్వారానే 1.01 మిలియన్ కలెక్షన్లను రాబట్టింది.
కింగ్డమ్ : విజయ్ దేవరకొండ హీరో గా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 933 కే కలెక్షన్లను ప్రీమియర్స్ ద్వారా నార్త్ అమెరికాలో రాబట్టింది. దానితో ఈ సంవత్సరం నార్త్ అమెరికాలో ప్రీమియర్ ద్వారా అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టు లో ఈ మూవీ రెండ వ స్థానంలో నిలిచింది.
హిట్ ది థర్డ్ కేస్ : నాని హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీమియర్ ద్వారా నార్త్ అమెరికాలో 891 కె కలెక్షన్లను రాబట్టింది.
హరిహర వీరమల్లు : పవన్ కళ్యాణ్ హీరో'గా నిధి అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన ఈ సినిమా ప్రీమియర్ ద్వారా నార్త్ అమెరికాలో 802 కే కలెక్షన్లను రాబట్టింది.
డాకు మహారాజ్ : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా రూపొందిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా నార్త్ అమెరికా లో 735 కే కలెక్షన్లను రాబట్టింది.