సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో కొంతvమంది కెరియర్ ప్రారంభించిన వెంటనే అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంటుంటారు. దానితో అలాంటి వారు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ స్థాయికి చేరుకుంటారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా కొంత మంది స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న వారు కూడా ఉన్నారు. కానీ కొంత మంది మాత్రం కెరియర్ ప్రారంభంలో అద్భుతమైన విజయాలను దక్కించుకొని సూపర్ సాలిడ్ క్రేజ్ లో కెరియర్ను ముందుకు సాగించిన ఆ తర్వాత మంచి విజయాలను అందుకోలేక కెరియర్ డౌన్ ఫాల్ అయిన బ్యూటీ లు కూడా ఉన్నారు.

అలాంటి వారిలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో ఈ బ్యూటీ తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. దానితో ఉప్పెన మూవీ తర్వాత ఈమెకు వరుస పెట్టి అనేక క్రేజీ తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె ఉప్పెన సినిమా తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు  మూవీలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈమె తెలుగు లో కెరియర్ను మొదలు పెట్టిన మొదటి మూడు సినిమాలతో మూడు విజయాలను అందుకొని హైట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. 

దానితో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది అని చాలా మంది భావించారు. కానీ ఆ తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి భారీ అపజయాలు దక్కడం మొదలు అయింది. ఈమె ఆఖరుగా తెలుగులో మనమే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కాస్త పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో భారీ ఎత్తున సినిమాలు లేవు. మరి ఈమె మంచి విజయాలను అందుకొని తెలుగులో మళ్లీ క్రేజీ అవకాశాలను దక్కించుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks