- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగార్జున కు లేడీస్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. మూడున్న‌ర దశాబ్దాలకు పైగా కెరీర్ కొనసాగిస్తూ, తన ప్రత్యేకమైన గ్లామర్, స్టైల్, అభినయంతో జనాల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఇప్పటికీ యంగ్ స్టార్లకు పోటీగా నిలబడేలా తన లుక్ , ఎనర్జీతో ప్రేక్షకులను మెస్మ‌రైజ్ చేస్తోన్న‌ నాగార్జున త్వ‌ర‌లోనే కూలీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున అంటేనే హీరోయిన్ల క‌ల‌ల రాకుమారుడు... చాలా మంది హీరోయిన్లు నాగార్జున‌తో ఒక్క సినిమా చేసే ఛాన్స్ వ‌స్తే చాలు అనుకుంటారు. సెట్స్ లో అంద‌రితోనూ ఫ్రెండ్లీ గా ఉండ‌డం, కో స్టార్ల‌కు మంచి కంఫ‌ర్ట్ ఇవ్వ‌డం.. ప్రొపెష‌న‌ల్ గా ఉండ‌డం తో నాగార్జున అంటే చాలా మంది హీరోయిన్లు ప‌డి చ‌చ్చేంత అభిమానంతో ఉంటారు.


నాగార్జున ప‌క్క‌న ఒక్క సినిమా చేస్తే చాలు త‌మ కు రొమాంటిక్ ఇమేజ్ వ‌చ్చేస్తుంద‌ని .. యూత్ లో మంచి ఫాలోయింగ్ పెరుగుతుంద‌ని హీరోయిన్లు ఆశ ప‌డుతూ ఉంటారు. అందుకే నాగార్జున ప‌క్క‌న న‌టిం చేందుకు చాలా మంది స్టార్ హీరోయిన్లు సైతం ప‌దే ప‌దే ఇంట్ర‌స్ట్ చూపిస్తూ ఉంటారు. ఒక‌ప్పుడు ర‌మ్య‌కృష్ణ ఆ త‌ర్వాత ట‌బు , సౌంద‌ర్య , త‌ర్వాత కాలంలో అనుష్క లాంటి హీరోయిన్లు నాగార్జున ప‌క్క‌న వ‌రుసగా న‌టించి హిట్లు కొట్టారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: