
కింగ్డమ్ సినిమాకు తెలుగుతో పాటు తమిళంలో మంచి ఆదరణ దక్కుతుందని ఆయన వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్నో పార్శ్వాలు ఉన్నాయని ఈ మూవీ కథను విన్న తర్వాత ఈ సినిమాను మూడు గంటల్లో చెప్పడం కష్టం అనిపించిందని పార్ట్1లో సూరి జర్నీని మాత్రమే చూపించమని ఆయన తెలిపారు. ముఖ్యంగా అన్నను వెతుక్కుంటూ ఎలా వెళ్లాడనేది మాత్రమే తీశామని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో కానిస్టేబుల్ గా కనిపించే సీన్స్ లో సన్నగా కనిపిస్తానని ఫ్యామిలీ స్టార్ చేయడానికి ముందు కొన్ని రోజుల పాటు చేసిన షెడ్యూల్ ఇది అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో స్పైగా, పోరాట యోధుడిగా కనిపించడానికి ఆరు నెలల పాటు ప్రత్యేక కసరత్తులు చేశానని అయన చెప్పుకొచ్చారు.
కింగ్డమ్ పార్ట్2లో స్టార్ హీరో కచ్చితంగా ఉంటారని ఆ హీరో ఎవరనేది దర్శకుడు చెబుతారని విజయ్ దేవరకొండ వెల్లడించారు. నెగిటివిటీ గురించి నేను పెద్దగా ఆలోచించనని పదేళ్ల కిందట నేను ఎవరికీ తెలియదని ఇప్పుడు ఇంతమంది నాకోసం వస్తున్నారంటే లక్ అని ఆయన అన్నారు. అర్జున్ రెడ్డికి బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నప్పుడు గర్వంగా అనిపించిందని ఆయన తెలిపారు. ఈ సినిమాకు మొదట నాగ దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశామని ఎన్టీఆర్ కోసం టైటిల్ త్యాగం చేశానని చెప్పుకొచ్చారు.