కొన్ని సంవత్సరాల క్రితం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ "రాక్షసుడు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2019 వ సంవత్సరం ఆగస్టు 2 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ ఆ సమయంలో మంచి విజయం సాధించింది. ఈ సినిమా విడుదల అయ్యి నేటితో ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆ సమయంలో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి , ఏ స్థాయి విజయాన్ని అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 5.40 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఉత్తరాంధ్రలో 2.37 కోట్లు , ఈస్ట్ లో 1.24 కోట్లు , వెస్ట్ లో 89 లక్షలు , కృష్ణ లో 1.09 కోట్లు , గుంటూరు లో 1.08 కోట్లు , నెల్లూరు లో 38 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14.47 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 71 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 41 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 15.59 కోట్ల కనెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 14.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 15.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 15.56 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ 36 లక్షల లాభాలను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ కి సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ భారీ ఎత్తున లాభాలను అందుకోలేక పోయింది. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరియర్ లో ఈ సినిమా ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bss