రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రజినీకాంత్ నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా నాగార్జున కీ రోల్ లో స్ శృతిహాసన్, ఉపేంద్ర వంటి దిగ్గజాలు నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే అలాంటి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా అభిమానుల కి నచ్చేసింది. అయితే కొంతమంది ట్రైలర్ లో లోకేష్ కనగరాజ్ మార్క్ డైరెక్షన్ కనిపించలేదని అన్నప్పటికీ ట్రైలర్ కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక వార్-2, కూలీ రెండు సినిమాలు ఆగస్టు 14న విడుదల కాబోతున్నాయి.కాబట్టి ఈ రెండు సినిమాల మధ్య పోటాపోటీ ఉంటుంది. అందుకే సినిమా విడుదలకు మరో పది రోజులు ఉండగానే ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు.

 ఈ నేపథ్యంలోనే తాజాగా రజినీకాంత్ కూలీ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తాను కన్నీళ్లు పెట్టుకున్న ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.రజినీకాంత్ మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో నా కాలేజ్ మిత్రుడు చేసిన పని నన్ను కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది.ఆ సంఘటన ఇప్పటికీ నాకు చేదు సంఘటనగానే మిగిలిపోయింది. ఒక రోజు నేను రోడ్డు మీద నిల్చొని ఉన్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి లగేజ్ టెంపో వరకు మోయమని చెప్పాడు. అయితే తెలిసిన వ్యక్తిలా ఉన్నాడే అని ఆలోచించుకుంటూనే లాగేజ్ తీసుకువెళ్లి టెంపో దగ్గర పెట్టాను. అలా ఆలోచిస్తున్న టైం లోనే అతడు నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం కదా అని గుర్తుకు వచ్చింది.

 ఇక టెంపో దగ్గర లగేజ్ పెట్టడంతోనే ఆ వ్యక్తి నా చేతిలో రెండు రూపాయల బిళ్ళ పెట్టి ఒకప్పుడు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు నువ్వు ఎంత అహంకారంతో ఉండేవాడివో గుర్తుందా అంటూ అప్పటి రోజులను గుర్తు చేసి మరీ వెళ్ళాడు. అయితే ఆయన అన్న మాటలు నాకు చాలా బాధను కలిగించాయి. కన్నీళ్లు పెట్టుకున్నాను.అంతేకాదు ఈ సంఘటన నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని చేదు సంఘటనగా మిగిలిపోయింది. అయితే కాలేజీలో చదువుతున్న సమయంలో ఆయన్ని నేను అప్పుడప్పుడు ఆటపట్టిస్తుండే వాడిని అంటూ రజినీకాంత్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ రజినీకాంత్ మాటలు విన్న ఆయన ఫ్యాన్స్ మాత్రం రజినీకాంత్ చేతిలో రెండు రూపాయలు పెట్టి ఆయన్ని కన్నీళ్లు పెట్టుకునేలా చేసిన వ్యక్తి ఎవరో గాని ఇప్పుడు రజినీకాంత్ స్టార్డం చూసి కుళ్ళు కుంటున్నాడు కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: