
మొదటి రోజు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11.34 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక రెండవ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.58 కోట్ల కలెక్షన్లు దక్కగా , మూడవ రోజు 4.34 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. నాలుగవ రోజు ఈ సినిమాకు 4.53 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇలా మొదటి నాలుగు రోజులు ఈ మూవీ కి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ మూవీ గురువారం రోజు విడుదల అయింది. దానితో ఈ సినిమాకు సోమవారం అనగా మొదటి వీక్ డే ఐదవ రోజు అయ్యింది. ఐదవ రోజు ఈ సినిమా కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమాంతం పడిపోయాయి. ఐదవ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 93 లక్షల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. దానితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఐదు రోజుల్లో ఈ సినిమాకు 25.72 కోట్ల షేర్ ... 42.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొంచుకుంటాయో లేదో చూడాలి.